రాయచోటి : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివద్ధికి విశేష కషి చేస్తుందని కలెక్టర్ గిరీష పేర్కొన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహ న్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మత్స్యకారుల అభివద్ధికి సందేశా న్నదిం చారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ్ల కలెక్టర్ గిరీష పిఎస్, జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్‌ఖాన్, మత్స్యశాఖ ఎడి సుస్మిత హాజర య్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్య సంపదను పెంచ డానికి, మత్స్యకారులకు వ్యాపారాలు సజావుగా చేసుకొని ఆర్ధికంగా నిలదొక్కుకోడానికి అనేక పధకాలను అమలు చేస్తోందన్నారు. మత్స్య కారవత్తి పైనే ఆధారపడి జీవనం సాగించే వారికి ప్రభుత్వం అనేక రకాలుగా ఉపకరణాలను అందిస్తుందన్నారు. ఫిష్‌ఆంధ్ర పేరుతో లైవ్ ఫిష్‌ను వినియోగదారులకు సరసమైన ధరలకు అందించడం ద్వారా ఇటు వినియోగ దారునికి, అటు మత్స్యకారునికి లబ్ది చేకూరుతుందని తెలిపారు. మత్య్సకారులకు మెరుగైన జీవనోపాధి, భద్రతకు భరోసా నిస్తూ మత్స్య రంగంలో ఎదుర్కొటున్న సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకొని మరింత అభివద్ధి చెందాలని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద 60 శాతం సబ్సిడీతో రూ.10 లక్షలతో డైలీ రెగ్యులర్ యూనిట్ షాపు నిర్వహించుకునేందుకు రూ.ఆరు లక్షల చెక్కును రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేటకు చెందిన మునెమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా మునెమ్మ అధికారులు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో మత్స్యశాఖ ఎడి రెడ్డయ్య, ఎఫ్‌డిఒలు మోహనకష్ణ, సుబ్బనరసయ్య, విఎఫ్‌ఒలు, మత్స్య సహకార సంఘం సభ్యులు, పిఎంఎంఎస్‌వై లబ్ధిదారులు పాల్గొన్నారు.