Aug 28,2023 00:32

ఆందోళన చేస్తున్న మత్స్యకారు​​​​​​​లు

ప్రజాశక్తి-నక్కపల్లి:హెటిరో కొత్త పైపులైన్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మత్స్యకారులు తలపెట్టిన శాంతియుత మహా ధర్నా 628వ రోజుకు చేరింది. ఆందోళన శిబిరం వద్ద ఆదివారం మత్స్యకారులు పైప్‌ లైన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కంపెనీ నుండి వెలువడే వాసనకు ముక్కు మూసుకుని నిరసన తెలిపారు. కంపెనీ వ్యర్ధ జలాలను సముద్రంలోకి వదలడంతో మత్స్య సంపద నశించి తామంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త పైపులైన్‌ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు గోసల స్వామి, పిక్కి ఏడుకొండలు, చేపల సోమేష్‌, దైలపల్లి శ్రీను, పిక్కి గంగరాజు , బొంది నూకరాజు, మైలపల్లి బాబ్జి, కొత్వాల కాశి, కారే కొదండరావు, పిక్కి రమణ తదితరులు పాల్గొన్నారు.