
ప్రజాశక్తి -నక్కపల్లి:హెటిరో డ్రగ్స్ కంపెనీ కొత్తగా వేస్తున్న పైపు లైన్ కు వ్యతిరేకంగా మత్య్సకారులు చేస్తున్న మహా శాంతియుత ధర్నా గురువారం నాటికి 531 రోజులకు చేరింది. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు మత్స్యకారుల ఆందోళనకు మద్దతు తెలిపారు. శిబిరం వద్ద మత్స్యకారులతో కలిసి పైప్ లైన్ కు వ్యతిరేకంగా ఆకులు కట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కంపెనీ వ్యర్ధ జలాలను సముద్రంలోకి వదలడంతో ఉపాధి కోల్పోయి తమంతా రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పైప్ లైన్ వేసి మత్స్యకారుల పొట్ట కొట్టొద్దన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎం.నానాజీ, నాయకులు గోసల సోమేశ్వరరావు, చేపలు సోమేష్, మైలపల్లి దార్రాజు, మైలపల్లి నరేష్, మైలపల్లి బాపూజీ, పిక్కి రాజు, వాసుపిల్లి నూకతాత, చోడిపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.
.
.............
............