Dec 04,2022 22:30

మాట్లాడుతున్న జయింట్‌ కలెక్టర్‌

ప్రజాశక్తి-ఎస్‌.రాయవరం:మండలంలోని మత్స్యకార గ్రామమైన బంగారమ్మపాలెం గ్రామంలో అనకాపల్లి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి ఆదివారం పర్యటించారు. ఈ సందర్బంగా స్థానిక మత్స్యకారులతో ఆమె మాట్లాడుతూ, వేటకు వెళ్లలేని సమయంలో తగిన పారితోషికం నేవీ అధికారులతో మాట్లాడి ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు. మత్స్యకార సంఘాల నిధులను విడుదల చేశామని తెలిపారు. స్థానిక మత్స్యకారులు మాట్లాడుతూ, ఏడు సంఘాలకు గాను ఆరు సంఘాల నిధులు విడుదల చేసారని, ఒక్క సంఘం నిధులు విడుదల కాలేదని తెలిపారు. సంఘం నిధుల పరిమితి పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్దీవో జయరాం, ఎస్డీసీ ( నేవీ ) లక్ష్మణమూర్తి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.