Mar 22,2023 00:21
మత్స్య సంపద యోజన వాహనాలను పంపిణీ చేస్తున్న కోన రఘుపతి

ప్రజాశక్తి-బాపట్ల: మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా వారి జీవనోపాధిని మరింతగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. మంగళవారం ఆయన స్వగహం వద్ద మత్స్యకార లబ్ధిదారులకు ఇన్సులేటెడ్‌ నాలుగు చక్రాల వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 40 నుంచి 60 శాతం సబ్సిడీపై ఇన్సులేటెడ్‌ వాహనాల ద్వారా ఉపాధి పొందేందుకు ఆయా వాహనాలకు యజమానులను చేస్తామని అన్నారు. వీరితో పాటు మరి కొంతమందికి మత్స్య పరిశ్రమ ద్వారా జీవనోపాధి కల్పించే అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి టి సురేష్‌, మత్స్యశాఖ సహాయ సంచాలకులు పి గాలిదేవుడు, కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కన్నా మామిడయ్య, ముత్తాయపాలెం, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు ఎం రవీంద్ర, బాపట్ల మత్స్య శాఖ అభివృద్ధి అధికారి పాల్గొన్నారు.