Oct 20,2023 23:31

మంగళగిరి: మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం తెనాలి రోడ్‌ లో నూతనంగా నిర్మించిన ఫిష్‌ ఆంధ్ర వెండింగ్‌ యూనిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కొక్క యూనిట్‌ను 2 లక్షల రూపాయల చొప్పున 17 యూనిట్లను ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో నిర్మించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, రాష్ట్ర చేనేత విభాగం వైసీపీ అధ్యక్షులు గంజి చిరంజీవి, కార్పొరేషన్‌ కమిషనర్‌ యు.శారదాదేవి పాల్గొన్నారు.