
ప్రజాశక్తి-ఐ.పోలవరం
ముమ్మిడివరం నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో ఉన్న మత్స్యకారుల ఆత్మీయ సదస్సు కు ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజ రౌతున్నారు. ఈ సందర్బంగా ఐ.పోలవరం మండలం పాతఇంజరం -ఎదుర్లంక వారధి,గుత్తెనదీవి,జి మూలపొలం గ్రామంలో నిర్వహిచిన మత్స్యకార సమావేశంలో హాజరైనారు.ముందుగా ఆయనకు శాలువా కప్పి,పూలమాలతో స్వాగతం పలికారు.ఆయన మాట్లాడుతూ ఈ నెల 21తేదీన మత్స్యకార దినోత్సవం సందర్బంగా రాష్ట్ర కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ్డ 4వ విడత ఒఎన్‌జిసి ద్వారా వచ్ఛే నష్ట పరిహార నిధులను మత్స్యకార అకౌంట్ లో బటన్ నొక్కి ప్రారంభిస్తారన్నారు.కనుక ఈసారి కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో మత్స్యకార సదస్సు నిర్వహిస్తామని, ముఖ్యమైన నాయకులు వస్తున్నారని, ఆడ, మగ పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి మోర్త రాణి మిరియం జ్యోతి, వైసిపిమండల కన్వీనర్ పిన్నమరాజు వెంకట పతి రాజు, జెడ్‌పిటిసి సభ్యులు ముదునూరి సతీష్ రాజు, కోరుకొండ సత్యనారాయణ, కాటం సత్తిరాజు, పెమ్మాడి బాబురావు, జిల్లా జనరల్ సెక్రటరీ రేవు అప్పారావు, మోకా రవి కుమార్, జిల్లా నాయకులు మోర్త చిన్నా, మట్టా గగనవీరుడు, స్థానిక నాయకులు గుత్తాల మురళీ కృష్ణ, గిడ్డి ఆనంద్, లంకే హరిబాబు, ఇసుకపట్ల అఛ్చి బాబు, మోర్త రాఘవులు, కామాడి శంకరం, కర్రి సత్యనారాయణ, సంగాని సత్యనారాయణ, ఓలేటి అప్పారావు, చింతా ధర్మరాజు, మందపాటి భైరవస్వామి, సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.