
బొబ్బిలిరూరల్: మత్స్య సంపద పెంపకం ద్వారానే మత్స్యకారులంతా ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు. బుధవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో పక్కి కోనేటిచెరువులో చేపపిల్లలను విడిచి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లోని చెరువుల్లో చేపపిల్లలు విడుదల చేయుటకు గాను 4,29,796 ఫింగెర్లింగ్ సైజు చేప పిల్లలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మత్స్య సంపద పెంచడం ద్వారా జీవనోపాధి లభిస్తుందన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఇదివరకే వలలు, వాహనాలు, శీతలీకరణ పెట్టెలు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి శంబంగి లక్ష్మి, వేణుగోపాలనాయుడు, జెడ్‌పిటిసి సంకిలి శాంతకుమారి, సర్పంచ్ పైడిరాజు, మత్స్యశాఖ ఎఇ సంతోష్, బొబ్బిలి మత్స్యశాఖ అధ్యక్షులు వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.