ప్రజాశక్తి-కాకినాడ నేడు దేశంలో మత ఉన్మాదం పెట్రేగిపోతుందని దాన్ని తిప్పికొట్టి మతసామరస్యాన్ని కాపాడమే అమరవీరులకు నిజమైన నివాళని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులడు ఎవి.నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుడు తోరాటి లక్ష్మణమూర్తి 72వ వర్థంతి, ఆదర్శ కమ్యూనిస్టు ఇనుగంటి రామతులసమ్మ ఐదో వర్థంతి సందర్భంగా సుందరయ్య భవన్‌లో పార్టీ జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సంస్మరణ సభలో నాగేశ్వరరావు మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమానికి ద్రోహం చేసి బ్రిటిష్ వారి పక్షాన నిలిచిన దేశద్రోహులు నేడు దేశ పాలకులుగా ఉండడం విచారకరమన్నారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించి మనుషుల మధ్య ఐక్యత పెంచి మతసామరస్యాన్ని కాపాడేందుకు కృషి చేయడమే అమరవీరులకు నిజమైన నివాళి కాగలదని చెప్పారు. పార్టీ సీనియర్ నాయకులు డి.శేషబాబ్జి మాట్లాడుతూ లక్ష్మణమూర్తి, రామతులసమ్మ తమ జీవితాలను దేశం కోసం అర్పించిన మహనీయులని వారి ఆశయాల బాటన పయనించడమే దేశ భవిష్యత్ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జి.బేబిరాణి, కె.వీరబాబు, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, సిహెచ్.రమణి, పి.వీరబాబు, పి.రామకృష్ణ, కె.రాజు, సిహెచ్.రాజకుమార్, టి.రాజా, చిన్న, విశ్వనాధం, కె.సింహాచలం, వర్మ, ప్రసాదరావు, ఎం.వి.రమణ, విజరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.










