ప్రజాశకి-కంచికచర్ల : మతసామరస్యానికి ప్రతీక ఉరుసు మహౌత్సవానికి నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్‌రావు అన్నారు. కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామం నుండి తుర్లపాడు హజరత్ బడేమియా బందగీ సయ్యద్ దర్గా ఉరుసు ఉత్సవాలకు బయలుదేరిన ఎడ్లబండ్లను ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు బుధవారం ప్రారంభించారు. పెండ్యాల గ్రామం నుండి చందర్లపాడు మండలం తుర్లపాడు వరకు మునేటి నుండి కుటుంబ సమేతంగా తరలివెళ్లారు. కంచికచర్ల, వీరులపాడు మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు పెండ్యాల నుండి తుర్లపాడు కు వెళ్ళే ముస్లిం మైనార్టీలకు ఎడ్లబండ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ, ముస్లింలు కలిసి ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ఉరుసు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయన్నారు. హిందూ కుటుంబాలకు చెందిన రైతులు అభిమానంతో తమ ఎద్దుల బండ్లపై ముస్లింల కుటుంబ సభ్యులను ఎక్కించుకొని దర్గాల వద్దకు ఊరే గింపుగా తీసుకువెళ్లడం అభినందనీయమని తెలిపారు .ఈ కార్యక్రమంలో ఎంపిపి బషీర్, ఎంపిటిసి బహదూర్, వైసిపి నాయకులు వేల్పుల రమేష్ పాల్గొన్నారు.










