ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడే శక్తులు ముందుకు రావాలని సిపిఐ (ఎంఎల్) ప్రతిఘటన కేంద్ర కమిటీ కార్యదర్శి షేక్షావలీ కోరారు. శుక్రవారం సిపిఐ (ఎంఎల్) ప్రతిఘటన కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులోని సాగునూరు రోడ్డులో ఉన్న మంగళ హనుమంతు, జేమ్స్ భవనం (పార్టీ కేంద్ర కార్యాలయం)లో ఐఎఫ్‌టియు జాతీయ నేత కదిరికోట జేమ్స్ ప్రథమ వర్థంతి సభ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి బి.ఏసేపు అధ్యక్షత వహించారు. జేమ్స్ సతీమణి కె.దానమ్మ, షేక్షావలీ, సిపిఐ (ఎంఎల్) ఆర్‌ఐ సెంట్రల్ కమిటీ మెంబర్ గడ్డం సదానందం, సిపిఐ (ఎంఎల్) భహుజన ప్రజారాజ్యం రాష్ట్ర కార్యదర్శి అనిశెట్టి రాము, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ సత్తెన్న, బాలరాజు, బీసీ సంఘం గణేష్, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నర్సన్న, నవ్యాంధ్ర ప్రదేశ్ జిల్లా అధ్యక్షులు అమరేష్, అడ్వకేట్ చార్లెస్, పిఒడబ్ల్యు (విముక్తి) ఎం.పుణ్యవతి, ఐఎఫ్‌టియు రాష్ట్ర కార్యదర్శి కె.నర్సన్న, జిల్లా కన్వీనర్ కెఎమ్‌డి.హనీఫ్, హైదరాబాద్ కన్వీనర్ బడీగే వెంకటేష్, చేనేత సంఘం నీలకంఠ, పిడిఎస్‌యు (ప్రభంజనం) కన్వీనర్ ఎం.ప్రకాష్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు కొలిమి ప్రసాద్, ఎస్‌కె.సైదులు, సీనియర్ కార్మికోద్యమ నేత నేతప్ప, పివైఎల్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ బానోత్ సంతోష్ నాయక్, జిల్లా కన్వీనర్ కె.చిన్ని ప్రసాద్, అరుణోదయ పి.సంపత్, ప్రజా కవి, కళాకారుడు రాంచంద్రన్న, విప్లవ అభిమానులు లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై అయోధ్య పీఠాధిపతి స్వామి పరమహంస చేసిన హత్య బెదిరింపు చర్యలు సిగ్గు చేటని విమర్శించారు. భావ ప్రకటన స్వేచ్ఛపై మనువాద సిద్ధాంత కాషాయ సంఫ్‌ు పరివార్ శక్తులు జరుపుతున్న దాడులు వ్యతిరేకించాలని కోరారు. సభ ప్రారంభంలో జేమ్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి, సంతాప సూచికంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. చివరలో జేమ్స్ ఆశయ సాధనకు పోరాడతామని వక్తలు ప్రతిన బూనారు.
జేమ్స్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తున్న నాయకులు










