Jul 23,2023 23:03

ప్రజాశక్తి-కాకినాడ మతోన్మాద మోడీ ప్రభుత్వాన్ని ఓడించడానికి కృషి విస్తృత వేదికల ద్వారా కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మంతెన సీతారామ్‌ పిలుపు ఇచ్చారు. సిపిఎం జిల్లా శాఖ కార్యదర్శుల శిక్షణ తరగతులు రెండు రోజుల పాటు సుందరయ్య భవన్‌లో నిర్వహించారు. ఈ తరగతుల్లో ఆదివారం సీతారామ్‌ మాట్లాడారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల విధానాలతో దేశ వనరులను దోచిపెడుతున్నారని, ఈ విధానాలను వ్యతిరేకించే పార్టీలు, సంస్థలపై కేంద్ర సంస్థలు ప్రయోగించి కేసులు పెడుతున్నారని, ప్రతిపక్షం లేకుండా పాలన సాగించాలని, రెండు పార్టీల వ్యవస్థ తీసుకొచ్చి ప్రాంతీయ పార్టీలను అణగదొక్కే బిజెపి కుట్రలు రాష్టంలోని పాలక, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకంచకుండా మౌనంగా ఉండడం దేనికి సంకేతం అని సీతారామ్‌ ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వం మణిపూర్‌లో గిరిజనులు, మహిళలఫై దాడులు జరుగుతున్నా పట్టించుకోకుండా అల్లర్లు ఆపే ప్రయత్నం చేయకుండా నిమ్మకు నీరేతినట్టు వ్యవహరించడం వెనుక గిరిజన ప్రాంతంలోని మైనింగ్‌, భూములు కాజేసే కుట్రలు ఉన్నాయనాన్రు. 25న దేశవ్యాప్త నిరసనలో విశాల ప్రజావేదికలను కలుపుకుని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. డి.శేషబాబ్జి ప్రిన్సిపల్‌గా వ్యవహరించిన ఈ క్లాసుల్లో కెఎస్‌.శ్రీనివాస్‌, కె.ప్రసాద్‌, ఎన్‌.సూరిబాబు, పి.వీరబాబు, రమణి, టి.ఈశ్వరావు తదితరులు పాల్గొన్నారు.