Apr 22,2023 19:40

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా నాయకులు గురు శేఖర్‌

ప్రజాశక్తి - నందవరం
ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బిజెపిని ఇంటికి సాగనంపుదామని, అందుకు ప్రజలందరూ సహకారం అవసరమవుతుందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సి.గురుశేఖర్‌, సిపిఐ జిల్లా సమితి సభ్యులు పంపన్న గౌడ్‌ కోరారు. శనివారం మండలంలోని కనకవీడు గ్రామంలో వామపక్షాల ఆధ్వర్యంలో 5వ రోజు ప్రచార భేరి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజలు ఆర్థిక అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని కోరారు. కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు రాజు, సిపిఐ మండల కార్యదర్శి గిడ్డయ్య, వృత్తి సంఘాల నాయకులు గోవిందు, దేవపుత్ర, ఆటో యూనియన్‌ నాయకులు ప్రభాకర్‌, విజరు పాల్గొన్నారు.