Apr 23,2023 23:02

ప్రజాశక్తి - యంత్రాంగం ప్రజల ప్రయోజనాలు, దేశ సంక్షేమం కోసం కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దించాలని పలువురు నాయకులు పిలుపు ఇచ్చారు. సిపిఐ, సిపిఎం ఆధ్వర్యాన ఆదివారం జిల్లాలో ప్రచార భేరి నిర్వహించారు. కాకినాడ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్పూర్తితో మోడీని గద్దె దింపుదామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య అన్నారు. డైరీఫారంలో నిర్వహించిన ప్రచారం భేరిలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధుతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నేటి సంఘపరివార్‌ ఫాసిస్టు శక్తులు మన దేశ ప్రజలను తీవ్ర కష్టాల పాలు చేస్తున్నారన్నారు. ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీల పరం చేస్తున్నారన్నారు. జిఎస్‌టి పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రాన్ని యాచించే భిక్షగాళ్లుగా మార్చారన్నారు. సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌ల పేరుతో మైనారిటీలపై ముఖ్యంగా ముస్లిం మైనారిటీల జీవితాలపై వేలాడే కత్తిని ఉంచారన్నారు. గోరక్షణ పేరుతో నిత్యం మైనారిటీలను, దళితులను హత్యా కాండలకు గురి చేస్తున్నారన్నారు. రామాలయం, కాశీ, మధుర పేర్లతో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారన్నారు. పాకిస్థాన్‌ - చైనా సరిహద్దు సమస్యల పేరుతో నిత్యం ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శులు తోకల ప్రసాద్‌, జి.లోవరత్నం, నాయకులు రాజు, బుజ్జి, ఎల్లమ్మ, మరియమ్మ పాల్గొన్నారు. పెద్దాపురం సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య పట్టణంలో సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతాలో పాల్గొన్నారు. సిరపరపు శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ ప్రచార సభలో ఆయన మాట్లాడారు. సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడారు. సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సిపిఎం నాయకులు కూనిరెడ్డి అప్పన్న, దారపురెడ్డి కష్ణ, గడిగట్ల సత్తిబాబు, యాసలపు రమేష్‌, గరగపాటి పెంటయ్య, రొంగల వీర్రాజు, దారపురెడ్డి సత్యనారాయణ, ఆర్‌.సుబ్బలక్ష్మి, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిఎస్‌.నారాయణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పెదిరెడ్ల సత్యనారాయణ, మడకల రమణ, అర్జున్‌ రావు, సూరిబాబు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. కాజులూరు మండలం చేదువాడ, కాజులూరు, శీలలంక, తిప్పరాజుపాలెం గ్రామాల్లో సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు కరపత్రాలు పంచుతూ, పోస్టర్లు అతికించారు. కూడళ్లలో సమావేశాలు నిర్వహించారు. సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌ మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ప్రజలపై భారాలు వేస్తూ కార్పొరేట్లకి దేశ వనరులను దోచిపెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వల్లు రాజబాబు, బుడితి ప్రభాకర్‌ రావు, జక్కి శ్రీనివాస్‌, దంగేటి శ్రీనివాస్‌, సిహెచ్‌.ముసలయ్య, షేక్‌ మీరా, దడాల సూర్యనారాయణప, ముడికి నాగేశ్వరరావు, కూరాటి ప్రసాద్‌ పాల్గొన్నారు. తాళ్లరేవు ప్రజావ్యతిరేక నిరంకుశ మతోన్మాద బిజెపిని సాగనంపుదాం దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార భేరి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్‌ టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దుప్పి అదృష్టదీపుడు, నేరేడుమిల్లి త్రిమూర్తులు, చొల్లంగి వెంకటలక్ష్మి, కట్ట శ్రీదేవి, సంతోష్‌ కుమార్‌ పాల్గొన్నారు.