Sep 11,2023 23:46

ప్రజాశక్తి తెనాలి : మతిస్థిమితం లేని మహిళ ఓ బాలుడితో సహా అదశ్యమైన కేసును పోలీసులు చాకచక్యంగా గంటల వ్యవధిలోనే చేధించారు. పట్టణ త్రీ టౌన్‌ సిఐ రమేష్‌ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం స్థానిక చంద్రబాబునాయుడు కాలనీ ఆరో లైన్‌ లో నివాసం ఉంటున్న బంధువుల ఇంటికి, వారి సమీప బంధువు గిరిజ అనే మహిళ సోమవారం సాయంత్రం వచ్చింది. ఆమె అప్పుడప్పుడు మతిస్థిమితం కోల్పోతుంది. కొంచెం సేపు కుటుంబ సభ్యులతో ముచ్చటించిన ఆమె, అకస్మాత్తుగా ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్లిన కొద్దిసేపటికి ఇంట్లోని నాలుగేళ్ల బాలుడు గౌతం విగేష్‌ కూడా కనిపించకపోవడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. వారిద్దరి కోసం ఇంటికి సమీపంలో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన సిఐ, ఎఎస్‌ఐ హైదరాలి తో పాటు సిబ్బందిని అదశ్యమైన మహిళ ,బాలుడిని వెతికేందుకు నియమించారు. వారు ఆటోకు మైకును ఏర్పాటుచేసి ఆ ప్రాంతమంతా మహిళ, బాలుడు వివరాలు వెల్లడిస్తూ వెతకడం ప్రారంభించారు. అలాగే,పట్టణంలోని ప్రధాన కేంద్రాలలో సిసి కెమెరాలు పరిశీలించారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌ వంతెన సమీపంలోని ఎడ్ల లింగయ్య పెట్రోల్‌ బంకు వద్ద నడుస్తూ వెళుతున్నట్లు సిసి టివి పుటేజిలో మహిళను బాలుడిని గుర్తించారు. వెంటనే అక్కడ ఆటో డ్రైవర్లను ఆరా తీశారు. అయినప్పటికీ సమాచారం లేకపోవడంతో బస్టాండ్‌ వరకు వెతికారు. బస్టాండ్‌ సమీపంలో బాలుడిని, మహిళలు గుర్తించారు. ఇరువురినీ క్షేమంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. చాకచక్యంగా వ్యవహరించి, గంటల వ్యాధిలోనే ఇరువురిని గుర్తించి కుటుంబ సభ్యులుకు అప్పగించడం పట్ల వారు పోలీసులకు కతజ్ఞతలు తెలిపారు.