
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
మత ప్రమేయాలు లేని రాజకీయాలు దేశానికి అవసరమని సిపిఎం జిల్లా నాయకులు పివి.ప్రతాప్, కర్రి నాగేశ్వర రావు అన్నారు. హిందూత్వ రాజకీయాలు-ప్రతిఘటనా పద్ధతులు నయా ఉదారవాద ఆర్థిక విధానాలు - ప్రభావం అంశంపై స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో కరెడ్ల రామకృష్ణ అధ్యక్షతన గురువారం మొదటిరోజు శిక్షణా తరగతులు నిర్వహిం చారు. ఈ శిక్షణా తరగతులుకు సిపిఎం జిల్లా నాయకులు పివి.ప్రతాప్, కర్రి నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి కూటమి తామే అందరికన్నా గొప్ప దేశభక్తులమని ప్రచారం చేస్తుందన్నారు. విమర్శించిన వారంతా దేశద్రోహులని ఎదురుదాడి చేస్తున్నారన్నారు. మత ప్రమేయం లేని రాజకీయాలు దేశానికి అవసరమ న్నారు. కార్మికుల మతవిశ్వాసాలను బట్టి కార్మికులను చీల్చి కార్మికోద్యమాన్ని బలహీన పరచడానికి రాజకీయాలు చేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి దారులకు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో కరెడ్ల రామకృష్ణ, జవ్వాది శ్రీను, శిద్దిరెడ్డి శేషుబాబు, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, పతివాడ నాగేంద్రబాబు, యడవల్లి వెంకన్న పాల్గొన్నారు.