* జన విజ్ఞాన వేదిక నాయకులు
* జెవివి నూతన కమిటీ ఎన్నిక
* పలు విభాగాలకు కన్వీనర్ల నియామకం
ప్రజాశక్తి - శ్రీకాకుళం: మత పోకడలతో కూడిన పాలన దేశానికే ప్రమాదకరమని జన విజ్ఞాన వేదిక నాయకులు హెచ్చరించారు. జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభను నగరంలోని యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. జెవివి వ్యవస్థాపక కార్యదర్శి కొత్తకోట అప్పారావు పతాకావిష్కరణ చేశారు. జిల్లా అధ్యక్షులు కుప్పిలి కామేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో జిల్లా గౌరవాధ్యక్షులు కొత్తకోట అప్పారావు, సీనియర్ సభ్యులు బొడ్డేపల్లి మోహనరావు, విద్యా విభాగం రాష్ట్ర కన్వీనర్ మల్లారెడ్డి పద్మనాభరావు, గరిమెళ్ల అధ్యయన వేదిక కన్వీనర్ వి.జి.కె మూర్తి, అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతాడ కృష్ణారావు మాట్లాడారు. చంద్రయాన్-3 విజయవంతానికి శ్రమించిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. శాస్త్రజ్ఞుల మేధో సంపత్తి మెండుగా ఉంటే చంద్రయాన్ దిగిన స్థలానికి శివశక్తిగా నామకరణ చేయడం విచారకరమన్నారు.
సైన్స్‌ను అవమానించిన వారితోనే దేశం నష్టపోతుందని, వీరిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాస్త్రీయ దృక్పథంపై ప్రజల్లో అవగాహన కల్పించి శాస్త్రీయ సమాజం నిర్మించడమే జనవిజ్ఞాన వేదిక లక్ష్యమని, ఆ దిశగా కృషి చేస్తున్న వేదిక మరింత బలోపేతం కావాలన్నారు. అనంతరం జన విజ్ఞాన వేదిక ప్రచురణలు 'శాస్త్రీయ అవగాహన అంటే ఏమిటి', 'విశ్వావతరణ నుంచి నరావతరణ', 'యస్పాల్ కమిటీ టు అడ్వయిజ్ ఆన్ రినొవేషన్ అండ్ రెజువెనేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్' పుస్తకాలను ఆవిష్కరించారు.
జిల్లా నూతన కమిటీ ఎన్నిక
మహాసభల్లో జన విజ్ఞాన జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షులుగా బొడ్డేపల్లి జనార్థనరావు, అధ్యక్షులుగా కుప్పిలి కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా గొంటి గిరిధర్, ఉపాధ్యక్షులుగా వాగ్దేవి, పాలకొండ కూర్మారావు, ఐ.జగన్మోహనరావు, సామ సంజీవరావు, కోశాధికారిగా కుమార్, కార్యదర్శులుగా ఆర్.సురేష్‌బాబు, కె.శ్రీనివాసు, జిల్లా ఆడిట్ కన్వీనర్‌గా ఉమామహేశ్వరరావు ఎన్నికయ్యారు. జిల్లా పాట్రాన్స్‌గా కొత్తకోట అప్పారావు, బొడ్డేపల్లి మోహనరావు వ్యవహరిస్తారు.
పలు విభాగాల జిల్లా కన్వీనర్లు ఇలా...
విద్య : పాలవలస ధర్మారావు (కన్వీనర్), బొడ్డేపల్లి జగన్నాథరావు,
సైన్స్ అండ్ టెక్నాలజీ : మన్మథరావు (కన్వీనర్), ఎం.తేజేశ్వరరావు
సమత : టి.ఎర్రమ్మ
చెకుముకి : పి.కూర్మారావు, కె.నగేష్, ఎం.రామకృష్ణారావు
యువత : బి.పురుషోత్తం, ఎ.కృష్ణారావు
కల్చరల్ : తమ్మినేని వైకుంఠరావు, పైడి రామస్వామి, బెండి సూర్యనారాయణ
సోషల్ మీడియా : చింతాడ కృష్ణారావు
పర్యావరణం : ఆగతమూడి వాసుదేవరావు, సిహెచ్.అమ్మిన్నాయుడు
ఆరోగ్యం : జి.సతీష్, కళ్యాణ్‌రాజ్
రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
సెప్టెంబర్ 9,10 తేదీల్లో బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించనున్న జెవివి 17వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కుప్పిలి కామేశ్వరరావు, గొంటి గిరిధర్ పిలుపునిచ్చారు.










