ఆర్థికసాయం అందజేస్తున్న సిఐటియు నేత రమణ
ప్రజాశక్తి -గాజువాక : విధి నిర్వహణలో హఠాన్మరణం పొందిన స్టీల్‌ప్లాంట్ సిఆర్‌ఎంపి విభాగం కార్మికుడు రాజేష్ కుటుంబానికి తోటి కార్మికులు అండగా నిలిచారు.మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్దేశంతో, తోటి కార్మికులంతా రూ.1.64లక్షలను సమీకరించి, మంగళవారం సిద్ధేశ్వరంలో మృతుని భార్య జ్యోతికి సిిఐటియు నాయకులు నమ్మి రమణ, నమ్మి చంద్రరావు, సతీష్ ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి నమ్మి రమణ మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన తోటి కార్మికులను అభినందించారు. యాజమాన్యం కూడా తక్షణమే రాజేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ టి.కృష్ణారావు, పాల్గొన్నారు.










