Jun 10,2023 20:59

పరామర్శిస్తున్న కోట్ల సుజాతమ్మ

ప్రజాశక్తి -దేవనకొండ
మండలంలోని చెల్లెల చెలిమల గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త కురువ రంగస్వామి పాణ్యం సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో శనివారం టిడిపి ఆలూరు ఇన్‌ఛార్జీ కోట్ల సుజాతమ్మ గ్రామానికి వెళ్లి నివాళులర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బైక్‌పై వెళ్తూ పాణ్యం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. టిడిపి వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టిడిపి మండల కన్వీనర్‌ విజయభాస్కర్‌ గౌడ్‌, మండల నాయకులు బడి గింజలు రంగన్న, మలకన్న, పరమేష్‌ గౌడ్‌, వెంకట స్వామి గౌడ్‌, రామాంజనేయులు, చెల్లెల చెలిమల, బేతపల్లి సర్పంచులు చిన్న రామప్ప, మహేశ్వర్‌ రెడ్డి ఉన్నారు.