మట్టి ఖర్చుల డబ్బులు అందజేస్తున్న ఎంపిటిసి ప్రదీప్‌కుమార్
ప్రజాశక్తి-విఆర్.పురం
మండలంలోని మట్టపల్లి గ్రామంలో సున్నం రాముడు 2022 డిసెంబర్ 3న సహజ మరణం పొందగా, ప్రభుత్వం నుంచి మంజూరైన లక్ష రూపాయల బీమా సొమ్ములో ముందుగా మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10వేలు బుధవారం రాముడు భార్య సున్నం కిట్టమ్మకు ఎంపీటీసీ పూనెం ప్రదీప్ కుమార్, స్థానిక సర్పంచ్ వెట్టి లక్ష్మి, సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాముడు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తూర్రం బాబురావు, సిపిఎం నాయకులు కారం సత్తిబాబు, సచివాలయం కార్యదర్శి ఆర్ రామారావు, వెల్ఫేర్ అసిస్టెంట్ సోడే నాగేశ్వరావు, గ్రామ వాలంటీర్ పాల్గొన్నారు.










