
ప్రజాశక్తి - భట్టిప్రోలు
మండలంలోని పల్లెకొన గ్రామానికి చెందిన గ్రేస్ ఫౌండేషన్ అధినేత కైతేపల్లి షాలెం రాజ్ మానవతా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. అమర్తులూరు మండలం బోడపాడు పంచాయతీలోని కెజీపాలెంకు చెందిన కొత్తపల్లి మాణిక్యరావు గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధికి గురై అనారోగ్యంతో గుంటూరు జిజిహెచ్‌లో చికిత్స పొందుతుండగా వైద్య ఖర్చులు నిమిత్తం రూ.10వేలు ఆర్ధిక సహాయం అందజేశారు. మూల్పురుకు చెందిన గాదిపోగు క్రీస్తుదాసు అనారోగ్యంతో మృతిచెందిగా గ్రామస్తులు ద్వారా తెలుసుకుని మట్టి ఖర్చులు నిమిత్తం రూ.5వేల ఆర్థిక సహాయం అందజేశారు. గ్రేస్ ఫౌండేషన్ అనునిత్యం నియోజకవర్గంలోని పేద, బడుగు, బలగన వర్గాల వారికి చేతనైన సహాయం అందిస్తుందని సంస్థ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కొత్తపల్లి సురేష్, రవి, సీతయ్య, సుబ్బారావు పాల్గొన్నారు.