
పాచిపెంట: విజయనగరం జిల్లా కొత్తవలస వద్ద జరిగిన రైలు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ పాచిపెంటలోని గాంధీ బొమ్మ ఆవరణలో సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు బోను గౌరినాయుడు, చింత పోలిరాజు, ఎస్ రామారావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ నిత్యం రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రమాదాలు జరగకుండా సిగల్స్ ప్రాబ్లమ్స్‌ను సరైన పద్ధతిలో పెట్టాలన్నారు. రైల్వేలో ఖాళీ పోస్టులు భర్తీ చేసి సిగల్ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ప్రమాదాలు లేకుండా చూసే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్నిదేనన్నారు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా భద్రత చర్యలు చేపట్టాలని కోరారు.