Apr 20,2023 23:42

ఇపిఎఫ్‌ఒ నిధుల తరలింపు తగదు


ప్రజాశక్తి - సామర్లకోట
సామర్లకోటలో చర్చి గోడ కూలి మర ణించిన ఇద్దరు కూలీల కుటుంబాటకు కుటుంబాలకు న్యాయం చేయాలని పలు పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యాన గురు వారం ఆందోళన చేపట్టారు. చర్చి పున ర్నిర్మాణ పనుల్లో మృతి చెందిన పిట్టా అర్జున రావు, మచ్చ నాగేశ్వరరావు కుటుం బాలకు న్యాయం చేయాలని పెద్దాపురం ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప, జనసేన నాయక ుడు తుమ్మల రామస్వామి, కెవిపిఎస్‌ జిల్లా కన్వీనర్‌ కురాకుల సింహాచలం, బిఎస్‌పి జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, సిపిఎం నాయకుడు కరణం ప్రసాదరావు ఆందోళన చేపట్టారు. చర్చి పాస్టర్‌, బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. చర్చలు ఫలిం చకపోవడంతో పోలీస్‌ స్టేషన్‌కు చేరి అక్కడ నిరసన తెలిపారు. రోజువారీ కూలి పని చేసు కుని కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్న కార్మి కులు చనిపోవడంతో వారి కుటుం బాలు రోడ్డున పడ్డాయన్నారు. ఎటువంటి అనుమ తులు లేకుండా చర్చిని నిర్మించ డంతోపాటు కనీసం ఇంజనీర్‌ పర్యవేక్షణ కూడా లేకపోవ డంతో ప్రమాదం వాటిల్లిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, ప్రమాదానికి కారణమైన చర్చి అధినేత పి.విజరుకుమార్‌, పాస్టర్‌ శేఖర్‌, ఇంజనీర్‌ సుబ్రహ్మణ్యంపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం చర్చి నిర్వాహ కులు, ఇంజనీర్‌పై సిఐ కె.దుర్గాప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న ఎంఎల్‌ఎ చినరాజప్ప, సంఘాల నాయకులు