Aug 17,2023 16:18

ప్రజాశక్తి - వీరవాసరం
మండలంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ గురువారం పరామర్శించి సానుభూతి తెలిపారు. తలతాడితిప్పకు చెందిన శ్రీ సీతారామస్వామి దేవ స్థానం ఛైర్మన్‌ పాలా నాగరాజును, మడుగుపోలవరం సర్పంచి బోనం పరమేశ్వరావును, బండి బాలాజీ, మత్స్యపురి గ్రామంలో బళ్ల పెన్నయ్య, జక్కు అబ్బులును ఎంఎల్‌ఎ పరామర్శించారు. ఆయన వెంట భీమవరం ఎఎంసి ఛైర్మన్‌ కోటిపల్లి బాబు, వీరవాసరం సర్పంచి చికిలే మంగతాయారు, అండలూరు సొసైటీ అధ్యక్షుడు మానుకొండ ప్రదీప్‌కుమార్‌, ఎంపిటిసి బోను జోత్స్సాదేవి ఉన్నారు.