May 11,2023 02:29
చుండూరులో ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందజేస్తున్న మంత్రి నాగార్జున

ప్రజాశక్తి-వేమూరు: చుండూరు మండలం పరిధిలో వివిధ కారణాలతో మృతిచెందిన కుటుంబాలకు బుధవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున చేతుల మీదుగా చెక్కులు అందజేశారు.
మూడు మృతుల కుటుంబాలు, 9 మంది వివిధ ప్రమాదాలలో గాయపడిన వారికి ఈ బీమా సొమ్మును అందజేశారు. వైఎస్‌ఆర్‌ బీమా పథకం కింద వీటి అందించినట్లు తహసీల్దార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైసిపి నాయకులు పాల్గొన్నారు.