Oct 11,2023 20:35

ప్రజాశక్తి - పోలవరం
   మండలంలోని ప్రగఢపల్లి పంచాయతీకి చెందిన తొంట హరికృష్ణ పోశీ కుమార్‌ పొలంలో కరెంట్‌ షాక్‌తో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి సిఎం సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చెక్కును పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు బుధవారం అందజేశారు. భర్త మృతి చెందడంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని ఆదుకోవాలని.. గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్‌ఎ దృష్టికి మృతుడు భార్య తోంట నాగమణి తీసుకురావడంతో ఎంఎల్‌ఎ చొరవతో చెక్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎంపిపి సుంకర వెంకట రెడ్డి, ప్రగఢపల్లి ఎంపిటిసి దాపర్తి మోహన రావు, స్థానిక నాయకులు ఉన్నారు.