ప్రజాశక్తి - ద్వారకా తిరుమల
పంగిడిగూడెం పంచాయతీ మెట్ట పంగిడిగూడెం గ్రామానికి చెందిన చిలక శ్రీను అనారోగ్యంతో మృతి చెందడంతో మృతుడి భార్య రజినికు తమ సానుభూతి తెలపడంతో పాటు, ఆ కుటుంబానికి జనసేన తరపున రూ.10వేల నగదు, బియ్యం, కూరగాయలు అందజేశారు. శుక్రవారం జనసేన మండల నాయకులతో కలిసి గోపాలపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొడ్డికేర్ల సువర్ణ రాజు ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా శ్రీను కుటుంబానికి జనసేన ఎప్పుడు అండగా ఉంటుందని, పిల్లలను బాగా చదివించి ప్రయోజకులును చేయాలని శ్రీను భార్య రజినికి సువర్ణరాజు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిలుకూరి ఫణి, తరగళ్ల శ్రీను, దాకారపు నరసింహమూర్తి, కేశిరెడ్డి రాజశేఖర్, కె.రాజేష్, గొన్నూరి శ్రీనివాసరావు, గొన్నూరి వేణు, హనుమంతరావు, శివనాగు, తైదుల పవన్ కుమార్, షేక్ అరీఫ్, కసిరెడ్డి నాని, షేక్ అహ్మద్‌లతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










