Jul 28,2021 14:39

హైదరాబాద్‌ : అక్కినేని కుటుంబంలో శుభకార్యం జరగనుంది. వైవిధ్యభరిత చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో సుమంత్‌ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. తన కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే అమ్మాయితో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. అలాగే సుమంత్‌ - పవిత్రల వెడ్డింగ్‌ కార్డ్‌ నెట్టింట్లో వైరల్‌గా మారడంతో.. అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగనున్నాయనే వార్త నిజమేననిపిస్తోంది. సుమంత్‌ గతంలో హీరోయిన్‌ కీర్తిరెడ్డితో వివాహమై.. విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
సుమంత్‌ 'ప్రేమకథ' చిత్రంతో వెండితెరకు పరిచయమ్యారు. ఆ తర్వాత హీరో నాగార్జునతో కలిసి 'స్నేమంటే ఇదేరా' చిత్రంలో నటించారు. ఈ సినిమా హిట్‌ కొట్టకపోయినా.. సుమంత్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే 'సత్యం, గోదావరి, గోల్కోండ హైస్కూల్‌' వంటి చిత్రాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలు పరాజయాల్ని చవిచూసినా.. మళ్లీరావా మూవీతో ట్రాక్‌లోకి వచ్చారు. సుబ్రహ్మణ్యపురం, 'కపటధారి' చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా 'అనగనగా ఒక రౌడీ'లో నటిస్తున్నారు.

sumanth