Jun 01,2023 19:49

అడుగుటకు జన్మనిచ్చిన మరుగుజ్జు మహిళ వైద్య సేవలు అందించిన డాక్టర్లు

మరుగుజ్జు మహిళకి పండంటి ఆడబిడ్డ
- సురక్షితంగా కాన్పు చేసిన జోహా హాస్పిటల్‌ వైద్య బృందం

ప్రజాశక్తి - ఆత్మకూర్‌

ఆత్మకూరు పట్టణంలోని స్థానిక జోహా హాస్పిటల్‌ నందు ఆత్మకూరు మండల పరిధిలో పెద్దనంతపురం గ్రామానికి చెందిన మొండి గోవర్ధని మూడు అడుగుల మరుగుజ్జు మహిళా పండంటి ఆడబిడ్డకు గురువారం ఉదయం జన్మనిచ్చింది. జోహా హాస్పిటల్‌ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ జరీనా తాజ్‌, అనస్తీసియా డాక్టర్‌ సలాం, పీడియాట్రిక్‌ డాక్టర్‌ వినోద్‌, డాక్టర్‌ మన్సూర్‌ భాష ఆధ్వర్యంలో పెద్దనంతపురం గ్రామానికి చెందిన మూడు అడుగుల మరుగుజ్జు మహిళ మొండి గోవర్ధని డాక్టర్ల పర్యవేక్షణలో సిజేరియన్‌ ద్వారా 1.8 కేజీల శిశువుకు జన్మనిచ్చింది. తల్లి గోవర్ధిని, శిశువు హాస్పటల్లో క్షేమంగా ఉన్నారు. మరుగుజ్జు మహిళా అతి క్లిష్టమైన పరిస్థితిలో ఆడబిడ్డకు జన్మనివ్వడం ఆనందంగా ఉందన్నారు.
గోవర్ధని మాట్లాడుతూ 'నాకు సురక్షిత డెలివరీ చేయాలని ఆత్మకూరు పట్టణంలో ఎన్నో హాస్పిటల్లో వెళ్లానని, నేను మరుగుజ్జుగా ఉండటంతో ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే కష్టమని అనేక మంది డాక్టర్లు నన్ను హాస్పిటల్లో అడ్మిట్‌ చేసుకోలేదు. నేను డెలివరీ కావటానికి సుదూర ప్రాంతమైన కర్నూలుకి వెళ్లినప్పటికీ ఏ డాక్టర్లు నన్ను పట్టించుకోలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసి విసుగపోయానని వాపోయాను చివరి ప్రయత్నంగా అత్యవసరంగా కాన్పు నొప్పులు వస్తుండటంతో జోహా హాస్పిటల్‌ను ఆశ్రయించాను. వెంటనే జోహా హాస్పిటల్‌ డాక్టర్లు స్పందించి సిజేరియన్‌తో సురక్షితమైన కాన్పు చేశారు. డాక్టర్ల బృందం కృషితో సురక్షితంగా కాన్పు చేశారు. నన్ను, నా బిడ్డను క్షేమంగా కాపాడిన జోహా హాస్పిటల్‌ డాక్టర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు'. జోహా హాస్పిటల్‌ మేనేజర్‌ ఫిరోజ్‌ బాష గోవర్ధనికి బ్రెడ్లను పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద ఆర్థిక సాయం వచ్చేటట్లు కృషి చేస్తానని పేర్కొన్నారు.