Dec 22,2022 22:52

రైతు బజార్‌లో ప్రారంభమైన డిసిఎంఎస్‌ దుకాణం

ప్రజాశక్తి -కంచరపాలెం : జివిఎంసి 52వ వార్డు పరిధి మర్రిపాలెం రైతుబజార్‌లో డిసిఎంఎస్‌ దుకాణాన్ని జిల్లా వ్యవసాయ వాణిజ్య మార్కెటింగ్‌ అధికారి యాసిన్‌, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌ పి.చినతల్లి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యాసిన్‌ మాట్లాడుతూ వినియోగదారులకు మంచి నాణ్యత ప్రమాణాలతో కూడిన సరుకులను సరసమైన ధరలకే అందించాలని డిసిఎంఎస్‌ అధికారులకు సూచించారు. డిసిఎంఎస్‌ చైరపర్సన్‌ పి.చినతల్లి మాట్లాడుతూ, నాణ్యత కలిగిన సరుకులు వియోగదారులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ బ్రాంచ్‌ మేనేజర్‌ చంద్రకుమార్‌, రైతుబజార్‌ ఎస్టేట్‌ అధికారి కె.వరహాలు, సహాయకుడు కె.ప్రతాప్‌, రైతుబజార్‌ వినియోగదారుల కమిటీ సభ్యులు, డిసిఎంఎస్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.