మర్రిపాడులో ఎంఎల్‌ఎ ఆనం పర్యటన
ప్రజాశక్తి-మర్రిపాడు : వెంకటగిరి ఎంఎల్‌ఎ ఆనం రామనారాయణరెడ్డి బుధవారం మండలంలో పర్యటించారు. నందవరంలో జరిగిన వివాహ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. మర్రిపాడులో ఇటీవల అనారోగ్యంతో bఔతి చెందిన కొండమ్మ, ప్రభావతమ్మ ఉత్తర క్రియలలో పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం నారాయణ గెస్ట్ హౌస్‌లో నాయకులతో కలసి పత్రికా విలేకరులతో మాట్లాడారు. వైసిపి నాలుగేళ్ల పాలనలో దళిత, గిరిజనుల సబ్‌ప్లాన్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. దానికి కేటాయించిన నిధులు దళితులకు ప్రయోజనాలకు, గిరిజనుల ఆర్థికాభివృద్ధికి ఎక్కడా లేదన్నారు. అలాగే రాష్ట్రంలో దళితులు, బడుగు బలహీన వర్గాలు, గిరిజనులు, మైనారిటీ వర్గాల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఆయనవెంట భీమవరం సొసైటీ మాజీ చైర్మన్ చిన్నారెడ్డి, మాజీ మండలాధ్యక్షులు పుట్టం బ్రహ్మానందరెడ్డి, నాయకులు నారాయణ, జనార్థన్, శ్రీనివాసులు నాయుడు, నాయబ్ రసూల్, గూడాల శ్రీనివాసులు, మైనారిటీ నాయకులు ఉన్నారు.










