Jul 28,2021 10:59

న్యూఢిల్లీ : దేశంపై కరోనా ప్రకోపం కొనసాగిస్తోంది. కేసులు, మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 17,36,857 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 43,654 మంది కరోనా బారిన పడ్డారు. మంగళవారం పోల్చితే 47 శాతం పెరుగుదల నమోదైంది. తాజాగా 640 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 3.14 కోట్లు చేరుకోగా.. 4,22,022 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 41,678 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. మరోసారి రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తం రికవరీలు 3.06 కోట్లకు చేరగా.. రికవరీరేటు 97.39 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 3,99,439 క్రియా శీల కేసులున్నాయి. క్రియాశీలరేటు 1.27 శాతంగా ఉంది. అదేవిధంగా గత 24 గంటల్లో 40,02,358 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 44,61,56,659కి చేరింది.