ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సమస్యలు లేని నియోజక వర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మరోసారి తమకు అవకాశమిస్తే.. ప్రజలు అడగడానికి, తాము చేయడానికి పనులేవీ పెండిగు లేని పరిస్థితి తెస్తామని చెప్పారు. గురువారం స్థానిక సుజాత కన్వెన్షన్ సెంటర్లో వైసిపి క్లస్టర్ స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలి, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఇచ్చిన హామీల్లో ఎక్కడ్కెనా పనులు పూర్తి కాకపోతే చెప్పాలని, వెంటనే పూర్తి చేస్తామని తెలిపారు. నగరాన్ని కార్పొరేషన్ స్థాయికి తగ్గట్లుగా అభివద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం అమలవుతున్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం దేశంలో ఎక్కడ్కెనా జరుగుతుందా? ఇంటికే వచ్చి వైద్యపరీక్షలు చేయడం ఎప్పుడ్కెనా ఉందా? అని ప్రశ్నించారు. నేడు రాష్ట్రంలో జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేకే, టిడిపి, జనసేన కలసి వస్తున్నాయని అన్నారు. ఈనెల 11 నుంచి ప్రతి ఇంటికీ వెళ్లి జగన్ నాయకత్వమే ఎందుకు కావాలో ప్రజలకు చెప్పాలన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ అధ్యక్షులు, జోనల్ ఇన్చార్జిలు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు పాల్గొన్నారు.
రామారాయుడు రోడ్డు పనులకు శంకుస్థాపన
నగరంలో కోటి 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న రామా రాయుడు రోడ్డు పనులకు గురువారం ఉదయం డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వైసిపి నగర అధ్యక్షుడు ఆశపు వేణు మాట్లాడుతూ కోటి 50 లక్షల రూపాయలతో 987 మీటర్ల పొడవున్న రహదారిని ఏర్పాటు చేయడంతో వివిధ వర్గాల్లో హర్షం వ్యక్తం అయింద న్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాపుగంటి ప్రకాష్ మాట్లాడుతూ నగరం అన్ని రంగాలలో అభివద్ధి చెందుతుం దన్నారు. కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ లయ యాదవ్, కమిషనర్ ఆర్ శ్రీరాములు నాయుడు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కేదారశెట్టి లక్ష్మణమూర్తి, వైసిపి నాయకులు కుమ్మరిగంటి శ్రీనివాసరావు, యడ్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.










