Aug 14,2023 23:32

ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్‌ : దేశాన్ని కాపాడుకోవడానికి మరో స్వాతంత్య్ర పోరాటం తప్పదని అఖిలభారత కిసాన్‌ సభ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య తెలిపారు. సంయుక్త కిసాన్‌ మోర్చా జిల్లా సమితి ఆధ్వర్యంలో ఒంగోలులో రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ, బహిరంగ సభ, సాంస్కతిక కార్యక్ర మాలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీని రావుల వెంకయ్య, ఎస్‌కెఎం జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ చర్చి సెంటర్‌ నుంచి పాత మార్కెట్‌ సెంటర్‌, బాపూజీ మార్కెట్‌ మీదుగా అద్దంకి బస్టాండ్‌ వరకూ చేరుకుంది. అనంతరం అక్కడ సభ నిర్వహించారు. సభకు సంయుక్త కిసాన్‌ మోర్చా జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రావుల వెంకయ్య మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని రైతులు, రైతు కూలిలు కార్మికులు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పాలన సాగి స్తున్నారన్నారు. స్వాతంత్రం వచ్చినప్పుడు నేటి వరకూ దేశ ప్రజల సంపాదనంతా కార్పొరేట్‌ శక్తులకు అప్పనంగా అప్పగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకాశం జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు నిండుతున్న దారిద్రం పోలేదన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పమిడి వెంకటరావు మాట్లా డుతూ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడు కోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు వి. బాలకోటయ్య మాట్లాడుతూ రైతులతో పాటు కౌలు రైతులకు సమాన హక్కులు కల్పిం చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యా యన్నారు ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంక టేశ్వర్లు, సిఐటియు జిల్లా నాయకులు జివి. కొండారెడ్డి, ఐఎఫ్‌టియు జిల్లా నాయ కులు మోహన్‌ ఈ సందర్భంగా ఉబ్బా కోటేశ్వరరావు బందం, కోడూరి నాంచార్ల బందం, అరుణోదయ జాలన్న బందం, ప్రజా కళా మండలి కళాకారుల బందం ప్రదర్శించిన ఆట మాట పాటలు ప్రేక్ష కులను ఆలోచింపజేశాయి. ఈ కార్యక్ర మంలో ఎపి రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి లలిత కుమారి. ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి. హనుమారెడ్డి, కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు దేవరపల్లి సుబ్బారెడ్డి నాయ కులు కె. వీరారెడ్డి, ఎఐటియుసి జిల్లా నాయకుడుపివిఆర్‌.చౌదరి పాల్గొన్నారు.