ప్రజాశక్తి - ఆదోని
ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ వైద్యులకు సూచించారు. శుక్రవారం ఆదోని పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రిసెప్షన్‌లో రికార్డులను, సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేసి విధుల్లో పూర్తి స్థాయి సిబ్బంది హాజరయ్యారా అని సూపరింటెండెంట్ డాక్టర్ లింగన్నను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవన్నారు. అనంతరం గత వారంలో కలెక్టర్ సృజన ఆదోని ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేయగా బాత్‌రూములపై అసహనం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. పూర్తిస్థాయిలో ఎప్పటిలోపు పూర్తి చేస్తారని ఆయన కాంట్రాక్టర్‌ను అడగగా పది రోజుల్లోపు పూర్తి చేస్తామన్నారు. కలెక్టర్ ఆదేశించిన సౌచాలయం పనుల పురోగతిపై పరిశీలించారు. సాయంత్రంలోపు పూర్తిస్థాయిలో టాయిలెట్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఆయనకు వివరించారు.
ఆస్పత్రిని తనిఖీ చేస్తున్న సబ్ కలెక్టర్










