
ప్రజాశక్తి -డుంబ్రిగుడ:మండల కేంద్రంలో నిర్మిం చిన తాగునీటి గ్రావిటీ పథకం మరమ్మత్తుకు గురవడంతో గత మూడు రోజుల నుంచి తాగునీరు అందక మండల కేంద్రం వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రం వాసులకు సురక్షిత గ్రావిటీ పథకమే తాగునీటికి ప్రధాన ఆధారంగా ఉంది. ఇతర తాగునీటి బావులు, బోర్లు లేవు. దీంతో గ్రామస్తులంతా ఆ గ్రావిటీ పథకం పైనే ఆధారపడి ఉన్నారు. గ్రావిటీ పథకం గెట్ వెల్ మరమ్మతుకు గురి కావడంతో గత మూడు రోజుల నుంచి తాగునీరు సరఫరా కాలేదు.ఈ విషయంపై స్థానికులు సంబంధిత అధికారులకు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా మరమ్మత్తు చేపట్ట లేదని స్థానికులు విమర్శించారు.సొంత బోర్లు తవ్వించుకున్న వారి దగ్గర నుంచి నీళ్లు అడుక్కుని ఉపయోగించుకోవలసిన పరిస్థితి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.