Nov 06,2022 00:02

శంకుస్థాపన చేస్తున్న మంత్రి అమర్‌నాథ్‌

రాష్ట్ర పరిశ్రమలు, ఐటిశాఖ మంత్రి గుడివాడ అమరనాథ్‌
ప్రజాశక్తి-కశింకోట :
కశింకోటలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్‌ అన్నారు. కశింకోటలో శనివారం ఆయన పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి నుంచి వెదురుపర్తికి ప్రధాన రహదారి నిర్మాణం వారం రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు. కశింకోట ప్రాంతంలో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, దీనివల్ల ట్రాఫిక్‌ సమస్యలతో పాటు, అసాంఘిక కార్యక్రమాలను నివారించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్‌ భీశెట్టి వెంకట సత్యవతి, జడ్పిటిసి దంతులూరి శ్రీధర్‌ రాజు, కశింకోట, అనకాపల్లి ఎంపిపిలు కలగా లక్ష్మి, గొర్లి సూరిబాబు, వైస్‌ ఎంపీపీ పెంటకోట జ్యోతి, సర్పంచ్‌లు కలగా గున్నయ్యనాయుడు, మంత్రి జయరజని, ఎమ్‌పిడిఒ కొంకి అప్పారావు, వైసిపి నాయకులు మళ్ళ బుల్లిబాబు, గొల్లవిల్లి శ్రీనివాసరావు, పెంటకొట శ్రీనివాసరావు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మలసాల కిషోర్‌ పాల్గొన్నారు.