ప్రజాశక్తి-కాకినాడ రూరల్ మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయించింది. బోర్డు సమావేశం ట్రినిటీ హాస్పిటల్లో బుధవారం అధ్యక్షుడు రిక్కీ గూటమ్ అధ్యక్షన నిర్వహించారు. ఎఐసిసి ఆధ్వర్యంలో ప్రతి నెలా నిర్వహించాల్సిన పలు సామాజిక కార్యాచరణపై చర్చించారు. దీనిలో భాగంగా ఈ నెల 19న కాకినాడ జిల్లావ్యాప్తంగా పదివేలకు పైగా మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఎఐసిసితో కలసి పనిచేయడానికి ఆసక్తి గలవారిని సభ్యులుగా చేర్చుకోవడానికి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐసిసి కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ స్టీఫెన్ ఆనంద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బిషప్ జోసెఫ్ బెన్నీ, కోశాధికారి పాల్ రాజ్‌కమల్, ఎన్.సామ్యూల్ జోసెఫ్, రెడ్డి అంకిత్ స్టీఫెన్, రూఫస్ కుమార్, డి.చార్లెస్, ఎం.ధర్మపాల్, ఎస్‌ఇ. ప్రశాంత్ కుమార్, స్టాన్లీ, డి.విల్సన్, డి.జాషువా గిరి, దైవ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.










