ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ : సిపిఎం సీనియర్ నాయకులు మొసలి పకీరయ్య భార్య, సిపిఎం మంగళగిరి మండల కార్యదర్శి మొసలి జ్యోతిబసు తల్లి అయిన శివమ్మ అనారోగ్యంతో ఇటీవల మరణించిన విషం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెదవడ్లపూడి వై గార్డెన్స్‌లో సోమవారం సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పలువురు పూలమాలలేసి నివాళులర్పించారు. వీరిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాజ్యసభ మాజీ సభ్యులు పి.మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు సిహెచ్ బాబూరావు, వి.వెంకటేశ్వర్లు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు, కె.నళినీకాంత్, ఎం.రవి, ఎస్‌ఎస్ చెంగయ్య, ఎన్.భావన్నారాయణ, నాయకులు జొన్న శివశంకర్, జెవి రాఘవులు, డి.వెంకటరెడ్డి, కె.నాగేశ్వరరావు, కె.శివరామకృష్ణయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరు కుమార్, నాయకులు చిన్ని తిరుపతయ్య, జె.జాన్‌బాబు, టిడిపి నాయకులు పి.శ్రీనివాసరావు, ఎ.జయసత్య, జె.కిరణ్‌చంద్, ఎం.రమేష్, ఎ.ఉమామహేశ్వరరావు, వైసిపి నాయకులు జి.చిరంజీవి, ఎం.శ్రీనివాసరెడ్డి, వేణుగోపాలరెడ్డి, ఇతర నాయకులున్నారు.










