Sep 25,2023 23:47

మొసలి కోసం గాలింపు చర్యల్లో పాల్గొన్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు

ప్రజాశక్తి - ఆత్రేయపురం
గోదావరి నది డెల్టా నుంచి బొబ్బర్లంక ప్రధాన కాలువలోకి ఇటీవల ప్రవేశించిన మొసలిని పట్టుకునేందుకు సోమవారం పోలీస్‌ శాఖ, అటవీ శాఖ వన్యప్రాణి సంరక్షణ అధికారులు, జల వనరుల శాఖ అధికారులు మొసలిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్‌ఐ బివై.కిరణ్‌కుమార్‌ జిల్లా డిప్యూటీ రేంజ్‌ అధికారి ఎం.రవి ఆధ్వర్యంలో కాలువల నీటిమట్టన్ని తగ్గించి మధ్య డెల్టా ప్రధాన కాలువ, లొల్ల లాకుల నుంచి విడిపోయిన ముక్తేశ్వరం కెనాల్‌, గన్నవరం అమలాపురం కాలువల్లో గాలింపు చేపట్టారు. మొసలి జాడ తెలిస్తే వెంటనే దాన్ని బంధించేందుకు వలలు సిద్ధం చేసినట్లు రావులపాలెం అటవీశాఖ అధికారి పట్టాభి తెలిపారు. నిరంతరం పెట్రోలింగ్‌ జరుగుతుందన్నారు. ఇదిలా ఉండగా లొల్లలో సమీపంలో మట్టిలో ముసలి పాద ముద్రలు కనబడడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలం గ్రామాల ప్రజలు ఎటువంటి భయాందోళన చెందనవసరం లేదన్నారు. ఎవరూ కాలువల్లోకి దిగరాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌ఐలు శ్రీనివాస్‌ ప్రసాద్‌, ఇరిగేషన్‌ ఎఇ పి.సత్యనారాయణ , డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ ఎ.రవి, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఎ.పట్టాభి బీట్‌ అధికారులు సాయిబాబా, ఉప్పు శ్రీనివాస్‌, బడుగు శ్రీనివాస్‌, రమణ, లోవప్రసాద్‌ పాల్గొన్నారు