Aug 28,2023 00:21

ఫ్రూట్స్‌ అందజేస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:గసభ పంచాయతీ మొర్రిగుడ గ్రామంలో ప్రత్యేక వైద్య నిపుణులతో మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేయాలని సిపిఎం మండల కమిటీ డిమాండ్‌ చేసింది. డయేరియాతో అరకువేలి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాంగి కొత్తును పరామర్శించిన సిపిఎం మండల కార్యదర్శి ఎస్బీ. పోతురాజు, ఆ పంచాయతీ మాజీ సర్పంచ్‌ పాంగి సురేష్‌ కుమార్‌, వార్డుమెంబర్‌ పి.సత్యనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొర్రిగుడలో తక్షణమే ఆర్వో ప్లాంట్‌ ద్వారా సురక్షిత తాగు నీరు అందించాలని డిమాండ్‌ చేశారు. ఆ గ్రామంలో సుమారు 220 కుటుంబాలు 1200మంది జనాభా ఉండగా గెడ్డలో కలుషిత నీరు తాగడంతో ప్రతి ఏటా మలేరియా, డయోరియా, వాంతులు, విరేచనాలతో మృతి చెందుతున్నారాన్నారు. గత ఏడాది డయోరియాతో 6గురు మృతి చెందగా వంద మందికి పైగా అరకువేలి ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌ చొరవతో చికిత్స పొంది కోలుకున్నారన్నారన్నారు.