ప్రజాశక్తి - జీలుగుమిల్లి
ఆర్‌టిసి బస్సులో ప్రయాణం సౌకర్య వంతం, సుఖమయం అని అధికారులు చెప్పే మాటలకు వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. బస్సు ఎక్కిన తర్వాత గమ్యానికి ఏ సమయానికి చేరుకుంటామనే విషయం తెలియ డంలేదు. ఏలూరు డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సు జీలుగుమిల్లి సమీపంలో రహదారిపై మరమ్మ తులకు గురైంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందు లు ఎదుర్కొన్నారు. కండక్టర్, డ్రైవర్, ప్రయా ణికు లు బస్సు తోయాల్సిన పరిస్థితి ఏర్పడి ంది. ఆర్‌టిసి అధికారులు స్పందించి ఫిట్‌నెస్ ఉన్న బస్సులను తిప్పాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు.










