మోటార్ బైక్ ఢ కొని వ్యక్తి మృతి
మోటార్ బైక్ ఢ కొని వ్యక్తి మృతి
ప్రజాశక్తి - గూడూరు టౌన్ : మోటారు బైక్ ఢకొీని వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు గూడూరు రెండో పట్టణానికి చెందిన రిటైర్డ్ ట్రాన్స్ కో ఉద్యోగి జనార్దన్ రెడ్డి (65) పనుల నిమిత్తం గూడూరు పట్టణంలోని వివేకానంద రోడ్డు సమీపంలో అవతలి వైపునకు రోడ్డు దాటుతుండగా అదే వైపు వెంకటేష్ అనే యువకుడు బైక్ ఢ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించాలని సూచించారు. అతను మార్గ మధ్యలోనే మతి చెందారన్నారు.










