
రాయచోటి : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ నిరసన కార్యక్రమానికి నారా బ్రాహ్మణి పిలుపు మేరకు శని వారం రాత్రి 7.05 గంటలకు మోత మోగించాలనే కార్యక్రమాన్ని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు సుగవాసి ప్రసాద్‌బాబు ఆధ్వ ర్యంలో టిడిపి కార్యాల యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి విజిల్స్ వేస్తూ, హార్న్ కొడుతూ, గిన్నెలు కొడుతూ గాలివీడు రోడ్డులో నిరసన తెలియ జేశారు. ప్రసాద్ బాబు పిలుపు మేరకు మాసాపేట, మునె ప్పగారిపల్లెలో మోత మోగిద్దాం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మయాన ఇర్శాద్‌ఖాన్, ఖాదర్హుస్సేన్, ఖలీల్, బాషా, నవాజ్, ఫరూక్, షకీల్, వాజిడ్, అఫ్రోజ్, సయ్యద్, అన్వర్, జవీద్, మస్తాన్, ఫిరోజ్ సాదిక్, ముత్తు కూరు రఫీ, జమాల్, ఖాదర్‌బాషా, సైఫుల్లా, కరామత్, షబ్బీర్, ిశ్రీనివా సులు, లాయర్ సతీష్ రెడ్డి, మంత్రి రెడ్డయ్య, శివ, సహాదేవా, బడిశెట్టి రవి, సాయిరాంరాజు, స్టూడియో ప్రసాద్, త్యాగరాజు, పిన్నంఅశోక్, బోనంశెట్టి తిమ్మయ్య, నాగ, వాకావాసు, చెన్నకష్ణనాయుడు, రెడ్డి, కోటి, శివ, శీన, మన్నేరు రామాంజనేయులు పాల్గొన్నారు. రాజంపేట అర్బన్ : చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా నారా బ్రాహ్మణి ఇచ్చిన పిలుపుమేరకు ప్యాలెస్ పిల్లి సిఎం జగన్ చెవులకు వినిపించేలా టిడిపి శ్రేణులు, జనసైనికులు, వీర మహిళలు నివాసాలు, కార్యాలయాల వద్ద నుంచే తనదైన శైలిలో 5 నిమిషాల పాటు మోత మోగించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు మాట్లాడుతూ వైసిపి పాలనలో రాష్ట్రంలో రావణ కాష్ట్రంగా మారిందని దుయ్యబట్టారు. చంద్రబాబును కక్షపూరితంగా అరెస్టు చేశారని, దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించి బాసటగా నిలవాలని తెలిపారు. ఆంగ్ల పత్రిక హాన్స్ ఇండియాలో కూడా కొద్ది రోజుల్లో నారా కుటుంబ సభ్యులైన నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణీలను, నందమూరి బాలకృష్ణను సైతం అరెస్టు చేస్తారని వార్త ప్రచురితమైందని తెలిపారు. ఈ విషయంపై తాను ఆ పత్రిక ఎడిటర్‌తో మాట్లాడానని, వారికి ఆ సమాచారం ఏ విధంగా అందిందని అడిగి తెలుసుకున్నానని తెలిపారు. స్పందించిన పత్రిక ఎడిటర్ మాకు పార్టీ ఉన్నత నాయకుల నుంచి సమాచారం అందిందని సమాధానం చెప్పారని తెలిపారు. కక్షపూరితంగా రాజకీయాల్లో అక్రమ అరెస్టులు చేస్తున్న జగన్‌ను ఇంటికి సాగనంపేందుకు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు నడుం బిగించాలని తెలిపారు. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల ఆగ్రహం ఎలా ఉంటుందో ప్రజలకు భయపడి ప్యాలెస్‌లో దాక్కుని ఉన్న జగన్ గూబ గుయ్యమనేలా తాడేపల్లి ప్యాలెస్ వరకు వినపడేలా ఈ మోతను మోగించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. త్వరలోనే తమ నాయకుడు జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని, తమకు న్యాయస్థానాల మీద అపార నమ్మకం ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఒంటిమిట్ట, వీరబల్లి, రాజంపేట, టి.సుండుపల్లి మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్: మహాత్మా గాంధీ చెప్పిన మూడు సూత్రాలను ప్రజలకు గుర్తు చేస్తూ వినూత్నంగా టిడిపి బాబుతో మేము సైతం రిలే నిరాహారదీక్ష కొనసాగించింది. పట్టణం లోని స్థానిక అన్నమయ్య సర్కిల్ వద్ద మాజీ శాసనసభ్యులు దొమ్మలపాటి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాబు గారికి తోడుగా నియంతపై పోరాటానికి మేము సైతం రిలే నిరాహారదీక్ష కార్యక్రమానికి మదనపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు పచ్చిపాల రామకృష్ణ ఆధ్వర్యంలో మద్దతు తెలుపుతూ మహాత్మా గాంధీ చెప్పిన చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్ పచ్చిపాల తులసి, మాజీ కౌన్సిలర్లు పులి మహాలక్ష్మి, రాధ, ఉషారాణి, ఎస్.ఎం.రఫీ, చాణుక్య తేజ, భవానీ ప్రసాద్, యర్రబల్లి వెంకటరమణా రెడ్డి, బొమ్మిశెట్టి పురుషోత్తం, రామిశెట్టి నీలకంఠ, ప్రభాకర్, కత్తి లక్ష్మన్న, పసుపులేటి శ్రీనివాసులు, కాశీ శ్రీరామ్ వాల్మీకి, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. పీలేరు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా పీలేరులో టిడిపి శ్రేణులు మోత మోగిద్దాం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. శనివారం రాత్రి ప్యాలెస్లోని సైకో జగన్ కి వినిపించేలా స్థానిక టిడిపి కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు 7 గంటల నుండి 7.05 వరకు 5 నిమిషాల పాటు ఈలలతో గోల చేశారు. సెల్ టార్చ్ వేస్తూ నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో భారీ స్థాయిలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.