Feb 25,2023 23:34

మాట్లాడుతున్న టిడిపి నేత పల్లా శ్రీనివాసరావు

టిడిపి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
ప్రజాశక్తి-గాజువాక :
గాజువాక భూసమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో వైసిపి ప్రభుత్వం జారీ చేసిన మోసపూరిత జిఒలు 60,71లపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి చర్చకు రావాలని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టిడిపి అధ్యక్షులు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు శనివారం పాత గాజువాక తెలుగుదేశం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రాజశేఖర్‌ జారీ చేసిన జిఒ44ను గౌరవించిన తర్వాత సిఎం చంద్రబాబు, దాన్ని రిజిస్ట్రేషన్‌, ప్లాన్‌ అప్రూవల్స్‌కు సంబంధిత శాఖలకు పంపిందన్నారు. గాజువాక ప్రజల పట్ల వైసిపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జిఒ 301పై ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా యథాతధంగా అమలు చేయాలన్నారు,జిఒ 60 ప్రకారం. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి లక్షలాది రూపాయలు భారం తప్పదన్నారు. సమస్య పరిష్కారంలో కాలయాపన చేయాలనే దురుద్ధేశ్యంతోనే జిఒ 71 తెరపైకి తెచ్చి, దాదాపు 7500 మంది జిఒ 301 పట్టాదారులను కార్యాలయాలు, బ్రోకర్లు చుట్టూ ప్రదక్షిణలు చేసే దుస్థితి వైసిపి ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జిఒ 44, లేదంటే జిఒ 301 ప్రకారం క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఎమ్మెల్యే నాగిరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే జిల్లా అధికారుల సమక్షంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే, జిఒల్లోని లోపాలను ప్రభుత్వానికి తెలియపరుస్తామన్నారు. కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గం ప్రసాదుల శ్రీనివాస్‌. జివిఎంసి డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ గంధం శ్రీనివాసరావు, 67వ కార్పొరేటర్‌ పల్లా శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్‌ మహమ్మద్‌ రఫీ, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి మొల్లివెంటి రాజు, బిసి సెల్‌ జిల్లా అధ్యక్షులు తమ్మిన విజరుకుమార్‌, నేతలు చెరుకూరు నాగేశ్వరరావు, గాజువాక నియోజవర్గ అధ్యక్షులు బలగ బాలు నాయుడు, పార్టీ జిల్లా కార్యదర్శి గోమాడ వాసు, 75వ వార్డు అధ్యక్షులు నమ్మి అప్పారావు, 65వ వార్డు ప్రధాన కార్యదర్శి కదిరి పోలరాజు పాల్గొన్నారు.