ప్రజాశక్తి -కోటనందూరు మోంస దగా చంద్రబాబు నైజం అని రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. శుక్రవారం తుని పట్టణంలో సాయి వేదికలో జెసిఎస్ నమోదు శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సిఎం వైఎస్.జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో దేశంలోనే విద్య, ఆరోగ్యం, తలసరి ఆదాయాల్లో అగ్రస్థానంలో నిలిచిందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అథోగతి పాలయిందన్నారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని ఆయన అనుచర గళానికే ప్రజాధనాన్ని దోచి పెట్టారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం నవరత్నాలతో సంక్షేమ ఫలాలను అర్హులైన వారందరికీ రాజకీయ పార్టీలు అతీతముగా ప్రజలకు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దని చెప్పారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న యనమల రామకృష్ణుడు నియోజకవర్గం ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. తుని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ తాను అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో తుని మున్సిపాలిటీ చైర్‌పర్సన్ ఏలూరు సుధారాణి బాలు, పోతల సూర్యమణి, లగుడు శ్రీనివాస్, లాలం బాబ్జి, జగటాల వీరబాబు, చింతకాయల చినబాబు, జిగటాలకోట సత్తిబాబు, పోతల లక్ష్మణ్, సోడిశెట్టి సత్య నాగేశ్వరరావు, షేక్ ఖాజా, రేలంగి రమణ గౌడ్, గారా శ్రీను, బోడపాటి శ్రీను, కృపానందం పాల్గొన్నారు.










