Aug 01,2023 23:34
'దిశ సైబర్‌ కవచ్‌' పరికరాన్ని ప్రారంభిస్తున్న ఎస్‌పి వకుల్‌ జిందాల్‌

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: సైబర్‌ మోసాలను కట్టడి చేయడానికి 'దిశ సైబర్‌ కవచ్‌' సాఫ్ట్‌వేర్‌ మిషన్‌ ఎంతగానో ఉపయోగపడు తుందని జిల్లా ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 'దిశ సైబర్‌ కవచ్‌' మానిటర్‌ను ఎస్‌పి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం 'దిశ సైబర్‌ కవచ్‌' పని చేస్తున్న విధానాన్ని తెలుసుకొని, మొబైల్‌లోని యాప్‌లను, డాటాను స్కాన్‌ చేస్తున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారు. జిల్లా ప్రజలకు అందు బాటులో ఉండేవిధంగా జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాల యంలో ఏర్పాటు చేసిన 'దిశ సైబర్‌ కవచ్‌' సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌పి పిలుపునిచ్చారు. ఎవరైనా వచ్చి 'దిశ సైబర్‌ కవచ్‌' మెషిన్‌కు వారి ఫోన్‌ను అనుసంధానం చేసుకొని వైరస్‌ను, సైబర్‌ మాల్‌వేర్‌లను డిలీట్‌ చేసుకోవచ్చు నన్నారు. అడిషనల్‌ ఎస్‌పి పి మహే ష్‌, ఏఆర్‌డిఎస్‌పి ఎండిహెచ్‌ ప్రేమ్‌కుమార్‌, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్‌ ఏ శ్రీనివాస్‌, పి బాలమురళీకృష్ణ, వెల్ఫేర్‌ ఆర్‌ఐ బి శ్రీకాంత్‌ నాయక్‌, అడ్మిన్‌ ఆర్‌ఐ ఎల్‌ మన్మథరావు, ఐటి కోర్‌ ఆర్‌ఎస్‌ఐ సిజె భరత్‌ ఇతర పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.