ప్రజాశక్తి - నగరం
టిడిపికి చెందిన 10కుటుంబాలు రాజ్యసభ సభ్యులు, వైసిపి బాపట్ల జిల్లా అధ్యక్షులు మోపిదేవి వెంకటరమణారావు సమక్షంలో వైసిపిలో చేరారు. మండలంలోని తాడివాకవారిపాలెం పంచాయితీ దాసరిపాలెంలో గడప గడపకు ప్రబుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన టిడిపి సానుభూతిపరులైన నున్న కోటేశ్వరరావు, నున్న కనకారావు, నున్న బోశయ్య, కుండకర్ల శివన్నారాయణ మరికొందరు మోపిదేవి సమక్షంలో వైసిపిలో చేరారు. పెదమట్లపూడి పంచాయతీ గూడపాటివారిపాలెంలో జరిగిన గడప గడప కార్యక్రమంలో నగరం ఎంపీపీ చింతల శ్రీకృష్ణయ్య తదుపరి విలేకరులతో మాట్లాడారు. పెద్దమట్లపూడి పంచాయతిలో వివిధ సంక్షేమ పధకాల ద్వారా రూ.11.43కోట్లు లబ్దిదారులకు అందించినట్లు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అననారు. ప్రజలు అడిగే సమస్యలనీ పరిష్కరించేదిశగా పనిచేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లొకేష్ మాత్రమే సంతోషంగా లేరని అన్నారు. ఎవరుతోనైనా పోత్తులకోసం ధ్వరాలు తెరిచారని ఆరోపించారు. డబ్బు ఇస్తామని లోకేష్ యువగళం పాదయాత్రకు పిలిచిన జనానికి డబ్బు సరిగ్గా ఇవ్వడం లేదని అన్నారు. ఇవి తాను చెప్పే మాటలు కాదన్నారు. యువగళంకు వెళ్లి వచ్చినవాళ్లే చెబుతున్నారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? ఎప్పుడు సిఎం కుర్చీలో కూర్చుందామనే తాపత్రయంతొ ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెప్పుకుంటూ తండ్రీ, కొడుకులు తిరుగుతున్నారని మోపిదేవి అన్నారు. సింగపూర్ కంపెనీలు అంటూ మాయమాటలు చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు సిఎంగా ఉండి కొడుకు లోకేష్‌ను మంగళగిరిలో గెలిపించుకోలేకపోయారని అన్నారు. ఇన్నాళ్లు కుప్పంలో 30నుంచి 40వేలు దొంగ ఓట్లుతొ గెలుస్తున్నారని, ఇపుడు అక్కడ వైసీపీ వాళ్ళు దొంగ ఓట్లు తొలిగిస్తున్నారని అన్నారు. ఎవరు, ఎన్ని కుట్రలు చేసిన మళ్లీ జగన్ సిఎం కావాలని ప్రజలు ఆశిస్తున్నట్లు చెప్పారు. మోపిదేవి వెంట ఎంపీపీ చింతల శ్రీకృష్ణయ్య, తాడివాక అనిల్ కుమార్, సర్పంచ్ లుక్కా బాపయ్య, జాఫర్, ఎంపిటిసి కరీమ్, మొగలిపువ్వు భాస్కరరావు ఉన్నారు.










