మోక్షగుండం సేవలు ఆదర్శనీయం
ఎపిఎస్‌పిడిసిఎల్ సిఎండి కె. సంతోష రావు
ప్రజాశక్తి - తిరుపతి టౌన్
ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరాయ సేవలను ఆదర్శంగా తీసుకుని సమాజాభివద్ధికి కషి చేయాలని ఎపిఎస్ పిడిసిఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోష రావు కోరారు. స్థానిక ఎపిఎస్పిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం మోక్షగుండం విశ్వేశ్వరాయ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎండి సంతోష రావు మాట్లాడుతూ. మోక్షగుండం ఇంజనీర్ గా అనేక నిర్మాణాత్మక పనులను చేపట్టి ప్రజల మదిలో శాశ్వతంగా నిలిచారన్నారు. పేద కుటుంబంలో జన్మించినప్పటికీ నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తూ సమాజాభివద్ధిలో మరపురాని పాత్రను పోషించారన్నారు. పనినే దైవంగా భావించిన ఆయనను అప్పట్లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదుతో గౌరవించడం గొప్ప విషయమన్నారు. దేశంలోని 8 విశ్వ విద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసి గౌరవించాయని తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎపిసిపిడిసిఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జె. పద్మాజనార్థన్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ రంగంలోని ఇంజనీర్లు మోక్షగుండం అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు కషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్లు వి.ఎన్. బాబు, ఎన్.వి.ఎస్. సుబ్బరాజు, కె. శివ ప్రసాద రెడ్డిలు మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరాయ సమాజానికి మహౌన్నత సేవలను అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చీఫ్ జనరల్ మేనేజర్లు డి.ఎస్. వరకుమార్, డి.వి. చలపతి, పి. అయూబ్ ఖాన్, కె. గురవయ్య, కె. విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు.
కరకంబాడి మార్గంలోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీర్స్‌డేను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.జయచంద్ర మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఇంజీనీర్ల పాత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్ మన్నెం రామిరెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవింద్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
ది అసోసియేషన్ ఆఫ్ ప్లానర్స్ అండ్ ఇంజినీర్స్ (టేప్) ఆధ్వర్యంలో ఇంజినీర్స్‌డే నిర్వహించారు.సిపిఐ కార్యాలయంలోని కల్యాణ మండపంలో కార్యక్రమానికి మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెట్ సిటీ ప్లానర్ అధికారి బాలసుబ్రమణ్యం హాజరయ్యారు. టేప్ అధ్యక్షులు ప్రసాద్‌రెడ్డి,ఛైర్మన్ వెంకటేష్‌బాబు పాల్గొన్నారు. ది వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్ ప్లానర్స్ అండ్ ఇంజినీర్స్ ఆధ్వర్యంలో జరిగింది. స్మార్ట్‌సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ ఆడిటోరియంలో రాజ్‌కుమార్ కచ్చర్ల అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజినీర్స్ దక్షిణాది రాష్ట్రాల ఉపాధ్యక్షులు చేతన జైన్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. భక్తవత్సలం, బాలసుబ్రమణ్యం, రెడ్డెప్పనాయుడు పాల్గొన్నారు.
టేప్ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ డే










