ప్రజాశక్తి -విజయనగరం కోట : నేను సైతం బాబు కోసం అంటూ, చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగు యువత ఆధ్వర్యంలో సోమవారం నాయకులు మెండ దాసునాయుడు ఆధ్వర్యంలో మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షులు రవికుమార్ , తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు వేమలి చైతన్య బాబు, ప్రధాన కార్యదర్శి గోలగాన సురేంద్ర , నియోజకవర్గాల అధ్యక్షులు గంటా రవి, శ్రీను రెడ్డి, పెడిరెడ్ల సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా అశోక్ బంగ్లా టిడిపి కార్యాలయం వద్ద 27వ రోజు నిరసన దీక్షలో పలు డివిజన్ల నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రొంగలి గలి రామారావు, చైతన్య బాబు, శంకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.










